Search This Blog

Sunday, November 27, 2011

"సోలో" చూసా..మీకు చూపిస్తా రండి..

సినిమా చూసి వారం రోజులైపోయింది(లాప్ టాప్ లో రోజూ పాతవి చూస్తుంటా...అది కాదు నేను చెప్పేది)...మనసు ఓ తెగ లాగేస్తుంటే ...దేనికి వెళ్ళాలో తెలియక పేపర్ తిరగేసా..."బెజవాడ" చూడాలనుంది నాకు.. కానీ, అది విడుదల వాయిదా పడిందని తెల్సుకుని ఉస్సూరుమన్నా....ఇంతలో మా బెజ్జంకి గాడు ( నా ఫ్రెండ్ లే) "సోలో కి వెళ్దాం రా..బావుందట" అనేసరికి కాదనలేకపోయా...అలా ఇద్దరం కలసి గాజువాక కి బయల్దేరాం..

థియేటర్ లో చూస్తే పెద్దగా క్రౌడ్ లేకపోయేసరికి కొద్దిగా నీరసం ఒచ్చిన మాట నిజమే....ఏ మాట కి ఆ మాటే చెప్పుకోవాలి..నేను ఎన్ని దారుణమైన సినిమాలు హాల్ లో చూళ్ళేదూ...బావున్నా బావుండకపొయినా అలవాటైన పనేగదా అని సీట్ లో ఇబ్బంది పడుతూనే కూర్చున్నా...(ఏం చేస్తాం నా ముందున్న అంకుల్ చాలా పొడుగు మరీ)..సరే ఇపుడు సినిమా లోకి వద్దాం...నారా రోహిత్ కధానాయకుడిగా..రూపొందించబడి
న చిత్రం.... అమ్మో మరీ పేపర్ భాష లొ వ్రాస్తున్నానేంటీ నేనేనా.. వద్దులెండి...మామూలుగా మాట్లాడుకుందాం.. సరే..నారావారి అబ్బాయి రెండోసారి హీరో గా నటించిన ఈ "సోలో" సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవలసింది, ఎక్కడా కూడా ఎటువంటి అశ్లీలత, అసభ్యతా లేవు..మనశ్శాంతిగా కుటుంబం మొత్తం కూర్చొని చూడొచ్చు( ఎక్కడా మొహాలు పక్కకి తిప్పుకోవడం లాంటివి చేయఖ్ఖర్లా)..ఇహ రెండోది..మన చిన్న బుర్రకి పదును పెట్టేసేంత భయంకరమైన ట్విస్ట్లూ , కన్ ఫ్యూజన్లూ ఏవీ లేవ్..ప్లెయిన్ మూవీ...

కధలోకి వస్తే ( ఈసారి నిజంగా కధ చెబుతా..ప్రామిస్)... ఎవరూ లేని అనాధ (సారీ అలాంటివాణ్ణే కదూ అనాధ అనేది..) సరే ఒక మామూలు అనాధ బాలుడు "గౌతం" (మన హీరో) చిన్నప్పటి నుంచీ అనాధ శరణాలయం లో పెరిగి పెద్దవాడైపొయి..ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తూంటాడు..తనకి జీవితం లో ఉన్న ఒకే ఒక లక్ష్యం ఒక పెద్ద కుటుంబం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేస్కోవడం...తనకు ఎలాగు కుటుంబం లేదు కనుక తన భార్య కు ఐనా పెద్ద కుటుంబం ఉంటే ఆవిధంగా ఐనా తనకొక ఉమ్మడి కుటుంబం దొరుకుతుందని ఆశ అన్నమాట...అందుకోసం పెళ్ళిళ్ళ బ్రోకర్ చుట్టూ..తిరిగి వేధిస్తుంటాడు..ఇంతలో ఒక అందమైన అమ్మాయి(ఇంకెవరు మన హీరోయిన్నే) ఒక చిన్న ఏక్సిడెంట్ వల్ల పరిచయం ఔతుంది..మొదటి చూపులోనే మనసు పారేస్కున్న మన హీరో గారు రొటీన్ గా ఫ్రెండ్స్ ద్వారా ఆ అమ్మాయి వివరాలు రాబడతాడు...ఆ అమ్మాయి మెడికో ( సైకో కాదు....సరిగ్గా చూడండి)..బొబ్బిలి లో ఆ అమ్మాయి ది చాలా పేద్ధ ఫేమిలీ అనీ తెల్సుకుని మురిసిపోతాడు...ఇహ ఆతరువాత..అ అమ్మాయిని పడేయడానికి చిన్న చిన్న పాట్లు ..ఫైట్లూ.. కామనే అనుకో... ఒకానొక సందర్భం లో మన హీరో నిజాయితీ ని గుర్తించిన వైష్ణవి( సినిమాలో హీరోయిన్ పేరు అదే) ప్రేమకు పచ్చ జెండా ఊపటంతో సినిమా మూడు పాటలు ఆరు కలలు గా సాగిపోతుంది....ఇంతలో అమ్మాయి తండ్రి(ప్రకాష్ రాజ్) అనుకోని విధంగా తన కూతురు చదువుతూన్న వైజాగ్ వస్తాడు..( వేరే పనిమీద లెండీ) అక్కడ..హీరో ని అనుకోకుండా కలుస్తాడు (వీడే హీరో అని వాడికి తెలీదు)..ఈ మీటింగ్ తరువాత తన కూతురు ఎవరినో ప్రేమిస్తుందనీ..అది వీడే అని నిర్ధారించుకున్నాక..హీరోయి
న్ని బలవంతంగా ఇంటికి తీసుకుపోతాడు...అప్పుడేమో మన హీరో నానా బాధలు పడిపోయి...హీరోయిన్ తండ్రి ని కలుస్తాడు...అప్పుడు ప్రకాష్ రాజ్ "ముందూ వెనకా ఎవరూ లేని నీలాంటోడికి నా కూతురుని ఇవ్వను పోరా అంటాడు...పైగా..నువ్ నా కూతురుని కనుక లేపుకుని వెళ్ళిపోతే..నువ్ ఆశించే ఆ ఉమ్మడి కుటుంబం నీకు దక్కదు..నేను నా కూతుర్ని వదిలేసుకుంటా అంటాడు...ప్రేమకి ఫేమిలీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే మన హీరో ఫేమిలీ లేనప్పుడు ప్రేమ మాత్రం ఎందుకని వదిలేసిపోతాడు... ఇక్కడ ఇంటర్వెల్ అన్నమాట...

ఫస్టాఫ్ లో కధ అంతా చక్కగా కామెడీ తో బాగానే నడుస్తుంది..కానీ మీకు అవి చూసేటప్పుడు పూరిజగన్నాధ్ గుర్తొస్తే నేనేం చేయలేను(ఎంతైనా పరశురాం జగన్ శిష్యుడే గా) ..ఇంక మన హీరో లో కి కూడా అప్పుడప్పుడూ ప్రభాస్, మహేష్ బాబు అలా వచ్చి వెళ్ళిపోతుంటారు...


సరే.. ఇంటర్వెల్ అయిపోయింది..ఆ మూతి తుడుచుకుని రండి...


ఇక్కడ ప్రకాష్ రాజ్ తన తమ్ముడి సలహా మేరకు వైష్ణవి కి ఒక పెద్ద ఫేమిలీ ఉన్న లండన్ సంబంధం(షాయాజీ షిండే & కో.) చూస్తాడు..(మాటిమాటికీ ఈ పేద్ధ ఫేమిలీ గొడవేంట్రా బాబూ అని తిట్టుకోకండి...ప్రకాష్ రాజ్ అక్క (జయసుధ) ఒక అనాధని ప్రేమవివాహం చేస్కోడం వల్ల పడ్డ బాధలు తన ముద్దుల కూతురు వైష్ణవి పడకూడదని ఆ తండ్రి తాపత్రయం..అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేమిలీ లేనివాడి తో పెళ్ళికి ఒప్పుకోడన్నమాట..చివరికి తన అక్క కొడుక్కి కూడా అదే కారణం తో పిల్లనివ్వనంటాడు..అదీ మేటర్..) సరిగ్గా ఇక్కడ వైష్ణవి ప్రేమ వ్యవహారం గూర్చి షిండే కి తెలుస్తుంది..అప్పుడు తను ప్రకాష్ రాజ్ తో.." ఈ పెళ్ళి జరగాలంటే...ఆ గౌతం కూడా పెళ్ళయ్యేదాకా..ఇక్కడే ఉండాలని పట్టుబడతాడు..అలా చేస్తేనే తనకి నమ్మకం గా ఉంటుందంటాడు..(ఇదేం ఖర్మమో..ఇలాంటి కోరిక ఏ పెళ్ళి కొడుకు తండ్రి ఐనా కోరతాడా..ఎంత సినిమా ఐతే మాత్రం..ఏం చేస్తాం పిదపకాలం పిదప బుద్ధులూనూ..) అప్పుడు ఇష్టం లేకపొయినా ప్రకాష్ రాజ్ గౌతం ని తీస్కొస్తాడు.. సరే పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా జరిగిపోతుంటాయి...హీరో మాత్రం కాం గా ఉంటూ..హీరొయిన్ ఏడుస్తుంటె చూస్తుంటాడు...మధ్యలో ఒకటి రెండు సార్లు..మనం లేచిపోదాం అని హీరోయిన్ చెప్పినా ఒప్పుకోడు..మొత్తం మీద ఎలాగో అందరినీ ఇంప్రెస్స్ చేస్తాడు మన హీరో..పెళ్ళి లొ ఒక చిన్న గొడవ లో పెళ్ళి కొడుకుని మన హీరో గారు కొట్టడం తొ..ఇంట్లోంచి బైటకు వెళ్ళిపోవల్సి వస్తుంది..వెళ్ళేముందు..ప్ర
కాష్ రాజ్ కి కాం గా ఫుల్ల్ క్లాస్ పీకి తన మనసులొ ఉన్నదంతా చెప్పి వెళ్తాడు..అదేమి పట్టించుకోని ప్రకాష్ రాజ్ పెళ్ళి పనుల్లో మునిగి ఉండగా..ఇంక లాభం లేదని హీరోయిన్ కూడా తన తండ్రి కి ఫుల్ల్ క్లాస్ పీకుతుంది...(పాపం ప్రకాష్,..అన్ని సినిమాల్లోనూ..పిల్లల చేత చెప్పించుకోడమే...హహహ...బొమ్మరిల్లు నించీ చూస్తున్నా,..) దానితో బాగా అలోచించిన ప్రకాష్ ఫేమిలీ అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కాదు ..నంబర్ ఆఫ్ ఎమోషన్స్ అని తెల్సుకుని...తన కూతుర్ని గౌతం కి ఇవ్వడానికి ఒప్పుకోవడం తో కధ ముగుస్తుంది...

నిర్మాణం : ఎస్.వి.కె సినిమా..

దర్శకత్వం: పరశురాం
సంగీతం: మణిశర్మ
నటన పరంగా..రోహిత్, నిషా అగర్వాల్ చాలా ఎదగాలనిపిస్తుంది.. కొన్ని చోట్ల ఐతే..రోహిత్ మరీ ప్లాస్టిక్ ఫేసే... జయసుధ, ప్రకాష్, షిండె ఎవరూ కొత్తగా నిరూపించుకోవల్సినదేమిలేదు.
..పరిధి మేరకు బాగా చేసారు అంతే..మిగతా అందరూ..వాళ్ళ హద్దుల్లో వాళ్ళున్నారు..
ఒక సాఫ్ట్ మూవీ తో దర్శకుడు పరశురాం సేఫ్ గేం ఆడాడు...
వెంటాడే డైలాగులు కొన్ని ఉన్నాయి..బావున్నాయి...
సంగీతం ఫర్వాలేదనిపించింది..
లొకేషన్స్ అన్ని వైజాగ్, విజయనగరం లో వే..(దాదాపుగా..)
చాన్నాళ్ళ తర్వాత ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ చేసింది..( ఈ మధ్య హీరోయిన్లే అన్నీ చేసేస్తూ..అవకాశాలివ్వట్లే మరి..)
టైంపాస్ కి ఒక్కసారి చూడోచ్చు...

4 comments:

  1. Mr.NSK nuvvu review rayaledu...Evaru chudani Preview ni matalatho chupinchestunav cnma ni?Inka evaru cnma ni chudarura,Ne matala Preview thone cnma ni chusina bagyam kanipistundi.Director ki chala nastham ni kalpistunavra...(Paaaaaapam ...)

    ReplyDelete
  2. cinema yemo kani andi mee review mathram chala aasakthiga undi.. start chesina tharuvatha mottham chadhive dhaakaa apalekapoyanu. chala saradhaga bhale raasaru.please keep it up. aithe memu bezawada review kosam wait cheyyali annamaata..idhi chadhivi nenu yevaroo peddavallu raasaranukunna.simply superb.
    -shasikanth

    ReplyDelete
  3. very welldone brother
    mee bhasha sailee annee baagunnayi. meeru review rayadam kante scripts rayadam better. but, oka reviewer ga nadi oka chinna salaha review ante story mottam kallaku kattinatlu cheppadam kaadhu story hints isthu works of the back ground departments criticise cheyyadam adi negative ga ne undavalasaina avasram emledu meelaaga positivie ga kuda raayochchu. eesaari aa jagrthalu teesukuntaru ani aashisthunnanu.
    -maheshkumar badipatla

    ReplyDelete
  4. super bro.naaaku review chadhivinatlu ledhu, yevaro naa pakkana koorchoni naatho matladuthunatlu undhi. very nice expression.
    -vishwas devarakonda

    ReplyDelete